లంచం అడిగిన అధికారిని కొట్టిన బీజేపీ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

లంచం అడిగిన అధికారిని కొట్టిన బీజేపీ ఎంపీ

November 3, 2022

లంచం అడిగిన ఓ అధికారి చెంప చెల్లుమనిపించారు బీజేపీ ఎంపీ సీపీ జోషి. రాజ‌స్థాన్‌లోని ప్ర‌తాప్‌ఘ‌డ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతుల నుంచి 5వేల లంచం తీసుకున్న‌ట్లు ఆ ఉద్యోగిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స‌దురు ఉద్యోగిని ఎంపీ సీపీ జోషి నిలదీసారు.

లంచం తీసుకోవడంపై ఆరా తీసారు. అంతటితో ఆగకుండా సదురు ఉద్యోగిపై చేయిచేసుకున్నారు. ఉద్యోగులు, రైతులు ముందే చెంప మీద కొట్టారు. అయితే ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కొందరు ఎంపీ చేసిన పనికి సపోర్ట్ చేస్తోంటే మరికొందరు విమర్శిస్తున్నారు. అందరి ముందు ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.