ప్రముఖ తమిళ నటుడు ‘చియాన్’ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విక్రమ్.. ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తమిళ మీడియా సంస్థలు తెలిపాయి. విక్రమ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన తన రాబోయే చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ లాంచ్‌కి హాజరు కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
తెలుగులో వచ్చిన శివపుత్రుడు మూవీతో విక్రమ్ అందరికీ సుపరిచితం. ఆ తర్వాత ఆయన.. అపరిచితుడు, మల్లన్న, ఐ మనోహరుడు సినిమాలతో ఎంతో ఫేమస్ అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరిస్తూ విలక్షణ నటుడిగా ఫుల్ పాపులర్ అయ్యాడు. తనదైన నటనతో నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే ఆయన.. టాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ సినిమాలో చోళ కిరీట యువరాజు గా విడుదలైన పోస్టర్ ఇటీవలె విడుదలై అందర్నీ ఆకట్టుకుంది.