వాలెంటైన్స్ వీక్ లో ఈ రోజు చాక్లెట్ డే. మరి నోరూరించే ఆ చాక్లెట్ తినడమే కాదు.. ఆ చాక్లెట్ తో ఇల్లు నిర్మిస్తే..? ఇదొక ఫాంటసీలా అనిపించినా ఇది వాస్తవం. మరి ఆ ఇంటి విశేషాలేంటో చదువండి.
హాన్సెల్, గ్రెటెల్.. పిల్లల కథలో ఒక మంత్రగత్తె. ఆమె తీపి వస్తువులతో ఇల్లు నిర్మిస్తుంటుంది. ఇది ఇలా ఫాంటసీ కథల్లోనే ఉంటుందని భావించేవాళ్లం. కానీ దానికి వాస్తవికతను జోడించి చాక్లెట్ ప్రియులందరి కోసం ఫ్రాన్స్ లో ఈ చాక్లెట్ ఇంటిని నిర్మించారు.
చాక్లెట్ కాటేజ్ అని పిలువబడే ఇంటిలో అతిథులు ఒకరోజు ఉండవచ్చు. దీనికి మీరు 50 యూరోలు చెల్లించాలి. అంటే మన కరెన్సీలో 4, 433 రూపాయాలన్నమాట. ఇది కేవలం ఒక రాత్రి గడపడానికి మాత్రమే. ఫ్రాన్స్ లో సెవ్రెస్ లో ఉంది. దీనిని ప్రసిద్ధ చాక్లేటియర్ జీన్ లైక్ డెక్లూజియు డిజైన్ చేశారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. తన కొడుకు సహాయంతో ఈ ఇంటిని నిర్మించాడు. ఈ ఇంటి నిర్మాణానికి 1.5 టన్నుల చాక్లెట్ ని ఉపయోగించారు. మొత్తానికి 600 గంటల్లో ఈ కాటేజ్ నిర్మాణం చేశారు.
చాక్లెట్ అంటే కరిగిపోతుంది. మారి ఈ కాటేజ్ కరుగకుండా ఉండడానికి చల్లని ఉష్ణోగ్రతను నిర్వహించాలి. ఈ నిర్మాణ సమయంలో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు. చాక్లెట్ చెక్కు చెదరకుండా, డిజైన్ ప్లాన్ సరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ కాటేజ్ లో ప్రతీ భాగం తినదగినది కాదు. ఫ్లోర్స్, బెడ్స్, గోడలు మినహా ఇంట్లో ఉన్నవన్నీ తినదిగినవే. ఇక బయట కూడా చాక్లెట్ బన్నీలు ఉంటాయి. అలాగే తెల్లటి చాక్లెట్ డక్ పాండ్ పక్కన హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.