టీషర్టు ఉతికిన చింపాంజీ.. నీ శుభ్రం పాడుగాను.. - MicTv.in - Telugu News
mictv telugu

టీషర్టు ఉతికిన చింపాంజీ.. నీ శుభ్రం పాడుగాను..

December 2, 2019

chimpanzee01

అప్పుడప్పుడు చింపాంజీలు చేసే చర్యలు మనుషుల వలే ఉంటాయి. ఈ చింపాంజీ చేసిన పని చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. ఎంచక్కా టీషర్టు ఉతికింది. చైనాలోనీ మీషుయి జూలో ఈ చింపాంజీ ఇలా కెమెరాకు చిక్కింది. యుహూయి పేరుగల దాని వయసు 18 ఏళ్లు. ఓ టీషర్టు తీసుకుని దానికి సబ్బు పెట్టింది. నీళ్లల్లో జాడిస్తూ ఉతికింది. బ్రష్‌తో రుద్దుతూ మళ్లీ మళ్లీ ఉతికింది. అక్కడ గ్రిల్ మీద కూర్చున్న మరో చింపాంజీ దాని చర్యలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఇది బట్టలు ఉతకడం ఎలా నేర్చుకుందబ్బా అని వీడియో చూసినవాళ్లు అడుగుతున్నారు. అందుకు వారు చెబుతున్న సమాధానం.. జూ కీపర్ బట్టలు ఉతుక్కోవడం చూసి నేర్చుకుందని. 

మూడేళ్ల పిల్లాడికి ఎంత తెలివి ఉంటుందో దీనికీ అంత తెలివి ఉందని జూ కీపర్లు తెలిపారు. చింపాజీలు శుభ్రత విషయంలో మనుషులకంటే ఎక్కవ పట్టుదలతో ఉంటాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. అవి తాము నిద్రపోయే స్థలాలను అతి శుభ్రంగా ఉంచుకుంటాయట.