చౌటుప్పల్ బీజేపీకి హ్యాండిచ్చిందా?
ఆశలు పెట్టుకున్న చౌటుప్పల్ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఈ మండంలపైనే మొదటి నుంచి ఆపార్టీకి కాన్ఫిడెన్స్ ఉంది. తీరా ఫలితాలు వచ్చే సరికి బీజేపీ అవాక్కయింది. అంచనాలకు భిన్నంగా టీఆర్ఎస్‌కు చౌటుప్పల్‌లో లీడ్ వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చౌటుప్పల్… బీజేపీని నిరాశపర్చడంతో కమలంలో కలవరం మొదలైంది.
ఎందుకిలా?
మునుగోడులో తొలుత చౌటుప్పల్ ఓట్లని లెక్కించారు. నాలుగో రౌండ్ వరకు ఈ మండలానికి చెందిన ఓట్లు ఉన్నాయి. నాలుగురౌండ్ల ఫలితం చాలా ఆలస్యంగా బయటికొచ్చింది. ఈసీ ఉదయం 10.20కి తొలి రౌండ్ ఫలితాల్ని అధికారికంగా వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసిన 10 నిమిషాల్లో మిగతా మూడు రౌండ్ల ఫలితాల్ని అప్‌లోడ్ చేశారు.
రౌండ్ టు రౌండ్
తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు అధిక్యం వచ్చింది. టీఆర్ఎస్ 6,496 ఓట్లు, బీజేపీకి 5126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 2,100 ఓట్లు వచ్చాయి.తొలి రౌండ్ టీఆర్ఎస్‌కు 1200 ఆధిక్యం వచ్చింది. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ లీడ్‌లోకి వచ్చింది రెండో రౌండ్‌లో టీఆర్ఎస్ 7,781 బీజేపీకి 8,622 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 1,537 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 841 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
మూడో రౌండ్‌లోనూ బీజేపీ లీడ్ లోకి వచ్చింది. టీఆర్ఎస్ 7390,బీజేపీ 7426 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 1926 ఓట్లు పడ్డాయి. కేవలం 36 ఓట్ల ఆధిక్యమే బీజేపీకి వచ్చింది. మళ్లీ నాలుగో రౌండ్ నుంచి కారు జోరు పెంచింది. టీఆర్ఎస్ కు 4,854,బీజేపీ 4,555, కాంగ్రెస్‌కు 1,817 ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 299 లీడ్ వచ్చింది.
చివరి రోజు దాకా
చివరిరోజు దాకా చౌటుప్పల్‌లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. అన్ని మండలాల కన్నా దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పోలింగ్ ముందు రోజు వరకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడే ఎక్కువ సమయం ఉన్నారు. పోలింగ్ ముందు టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత నాన్ లోకల్స్ మునుగోడులోనే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి ఆందోళనకు దిగారు.
మునుగోడు , ఉపఎన్నిక, ఫలితాలు, బీజేపీ, టీఆర్ఎస్ , రౌండ్ టు రౌండ్
నోట్ : కౌంటింగ్ ప్లస్ బీజేపీ ఇమేజెస్ పెట్టండి..