క్రిస్ గేల్ ఖాతాలో మరో రికార్డు.. - MicTv.in - Telugu News
mictv telugu

క్రిస్ గేల్ ఖాతాలో మరో రికార్డు..

October 16, 2020

vnvgnfg

ఈ సీజన్ ఐపీఎల్‌లోకి స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ రీఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే తనదైన శైలిలో ఆడి పంజాబ్ జట్టుని గెలిపించాడు. ఈ సీజన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఫుడ్‌ పాయిజన్ కారణంగా ఈ ఏడాది మొదటి ఏడు మ్యాచ్‌లకు గేల్ దూరమయ్యాడు. నిన్న బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో  గేల్ చెలరేగాడు. 45 బంతుల్లో ఐదు సిక్సులు, ఓ ఫోర్ సహాయంతో 53 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్‌ను సృష్టించాడు. 

ఇప్పటివరకు టీ20ల్లో గేల్ 13,349 పరుగులు చేశాడు. టీ20ల్లో గేల్ ఇప్పటివరకు 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో కోహ్లీ 48 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాళ్లలో కెప్టెన్ రాహుల్ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.