రూ. 107 కోట్లక్రిస్మస్ చెట్టు.. అన్నీ వజ్రాలే - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 107 కోట్లక్రిస్మస్ చెట్టు.. అన్నీ వజ్రాలే

December 4, 2019

Christmas Tree.

ఈనెల 25న జరగబోయే క్రిస్మస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రిస్మస్ చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఎలాంటిదో తెలిసిందే. ఆ ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతూ.. స్పెయిన్ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ‘ద కెంపిన్‌స్కి హోటల్ బాహియా’ క్రిస్మస్ చెట్టును వినూత్నంగా, అత్యంత ఖరీదుతో సిద్ధంచేసింది. 16 అడుగుల పొడవుతో ఉన్న ఈ చెట్టుకు సుమారు రూ.107.6కోట్ల (15 మిలియన్ డాలర్ల) విలువైన వజ్రాలతో అలంకరించారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీగా పేరు గడించింది.  

గులాబీ, తెలుపు, ఎరుపు వజ్రాలతో పొదిగిన ఈ చెట్టు చూపరులను ఇట్టే ఆక్టర్షిస్తుంది. వజ్రాలే కాకుండా  ఆర్పెల్స్, బల్గరీ, కార్టియార్, ఆస్ట్రిచ్ గుడ్లు, వాన్ క్లెఫ్, పెర్‌ఫ్యూమ్స్, నెమలి, చానెల్ ఆకారంలో 3డీ ప్రింటెడ్ చాక్లెట్ ఆభరణాలతో చెట్టును అందంగా, ఆకర్షణీయంగా తయారుచేశారు. ఇదిలావుండగా  2010లో అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. దానిని రూ.78కోట్ల 70లక్షల 42వేల 300(11మిలియన్ అమెరికన్ డాలర్లు)ల విలువైన నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్లు, వాచ్‌లతో సింగారించారు.