Home > Featured > భారత ఫుట్‌బాల్ కెప్టెన్ చుని గోస్వామి మృతి 

భారత ఫుట్‌బాల్ కెప్టెన్ చుని గోస్వామి మృతి 

Chuni Goswami - A footballer who could count India’s president as his fan

భారత మాజీ కెప్టెన్, ఫుట్‌బాల్ లెజెండ్‌ చుని గోస్వామి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గుండెపోటుతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో మృతిచెందారు. 82 రెండు సంవత్సరాలు వయసున్న గోస్వామికి భార్య, కుమారుడు ఉన్నారు. గోస్వామి 1956 నుండి 1964 వరకు ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా భారతదేశం తరపున 50 మ్యాచ్‌లు ఆడాడు. క్రికెటర్‌గా, 1962 మరియు 1973 మధ్య 46 ఫస్ట్ క్లాస్ ఆటలలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించారు.

అత్యంత విజయవంతమైన భారత ఫుట్‌బాల్ కెప్టెన్‌గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచివుంటుందని పలువురు ఆయన మృతిపట్ల సానుభూతి తెలియజేస్తున్నారు. 1962 ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని తీసుకువచ్చారు. 1964 ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచారు. బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. కాగా, 1938 జనవరి 15న ఉమ్మడి బెంగాల్ రాష్ట్రంలోని కిషోర్ గంజ్(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో ఆయన జన్మించారు. 1954లో స్థానిక మోహన్ బగన్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున తన కెరీర్‌ను ప్రారంభించారు. కాలేజీ రోజుల్లోనే కల్‌కత్తా యూనీవర్సిటీ ఫుట్‌బాల్, క్రికెట్ జట్లకు సారథ్యం వహించారు. ఆయన మృతి పట్ల ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆయన ఆత్మక శాంతి చేకూరాలని ట్వీటర్‌లో పేర్కొంది.

Updated : 30 April 2020 9:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top