ప్రార్థనలు చేస్తుండగా కూలిన చర్చి.. 22 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రార్థనలు చేస్తుండగా కూలిన చర్చి.. 22 మంది బలి

October 24, 2020

భక్తులు ఎంతో శ్రద్ధతో ప్రార్థన చేస్తూ, కీర్తనలు పాడుతుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు భవనం కదిలిపోయింది. ఏకంగా ఆరంతస్తుల భవనంతో కావడంతో పేకమేడలా కుప్పకూలిపోయింది. ఆర్తనాదాలు, అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిందింది. మొత్తం 22 మంది చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఆఫ్రికా ఖండంలోని ఘనాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. 

పశ్చిమ ఘనాలోని ఆరంతస్తుల భవనం నిర్మాణ లోపాల వల్ల కూలిపోయంది. ఆ సమయంలో అక్కడ 60 మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సిమెంటు దిమ్మెలు, ఇటుకలు కమ్మేయడంతో పలువురు అందులోనే చిక్కుకుపోయారు. సహాయక బృందాలు హుటాహుటిన వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.