Home > Featured > పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన ఎస్ఐ.. పొద్దు పోవడం లేదంట..

పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన ఎస్ఐ.. పొద్దు పోవడం లేదంట..

CID SI Arrested in Rummy Game

లాక్‌డౌన్ సమయంలో పోలీసులంతా బందోబస్తులో బిజీగా ఉంటే ఓ ఎస్సై మాత్రం తన క్రీడా స్పూర్తికి పదునుపెట్టాడు. కాళీగా ఉండటంతో బోర్ కొట్టి పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలో ఇది జరిగింది. ఎస్సై తో పాటు మరో ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు పేకాట స్థావరాలపై దాడి చేశారు. అక్కడ పట్టుబడిన వారిలో కర్నూలు సీఐడీ విభాగానికి చెందిన ఎస్సై రాజశేఖర్ కూడా ఉన్నారు. దీంతో కంగుతిన్న పోలీసులు అందరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ విభాగంలో పనిచేసే పోలీసులే ఇలా జూదంలో మునిగిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా
లాక్‌‌డౌన్ కావడంతో ఖాళీ ఉండలేక చాలా మంది జూదం వైపు మళ్లుతున్నారు. అనేక ప్రాంతాల్లో పేకాట, కోడిపందాలు జోరుగా జరుగుతూనే ఉన్నాయి.

Updated : 9 May 2020 4:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top