శివుడికి సిగరెట్లతో మొక్కులు.. పొగ కూడా వస్తుంది! - MicTv.in - Telugu News
mictv telugu

శివుడికి సిగరెట్లతో మొక్కులు.. పొగ కూడా వస్తుంది!

February 21, 2020

gbgb

నిష్ఠతో ఉపవాసం, భక్తితో జాగారానికి దేశవ్యాప్తంగా భక్తులు సిద్ధమై శివరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారు. భోళా శంకరుడి మొక్కులు చెల్లించుకోవడానికి తెల్లవారుజాముననే నిద్రలేచి, పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొందరు పాలు, పళ్లు ఫలాలు మాత్రమే తీసుకుని ఉపవాసం ఆచరిస్తున్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో మాత్రం భక్తులు శివుడికి సిగరెట్లతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. చిత్రంగా ఉన్నా అక్కడ ఇది అనాదిగా ఆచారంలా కొనసాగుతూ వస్తోంది. 

జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివుడికి భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిగరెట్లను అక్కడి శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతాయని భక్తుల నమ్మకం. సిగరెట్ వెలిగాక అచ్చం మనం పొగ పీల్చినట్టుగానే సిగరెట్ నుంచి పొగ వస్తుంది. శంకరుడికి ఇలా సిగరెట్లను సమర్పించడం వల్ల భక్తుల మనోవాంఛలన్నీ తీరుతాయని వారు నమ్ముతారు. ఈ మందిరాన్ని 1621లో నిర్మించారట. కొండల నడుమ ఎంతో దివ్యంగా వెలిసింది ఈ ఆలయం. ప్రతీ ఏడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అక్కడికి తండోపతండాలుగా వస్తుంటారు.