సిగరెట్ల దొంగల్లారా తప్పించుకోలేరు - MicTv.in - Telugu News
mictv telugu

సిగరెట్ల దొంగల్లారా తప్పించుకోలేరు

August 21, 2017

మనం ఇన్ని రోజులు రకరకాల దొంగల గురించి విన్నాం గానీ సిగరెట్ దొంగల గురించి వినలేము కదూ. చాలా చిత్రంగా వుంది కదూ వింటుంటే. చైన్ స్మోకర్లు అయ్యుండొచ్చు. లైఫ్ లాంగ్ పాన్ కోకకు పోయి కొనుక్కోకుండా వుండేదుకు పకడ్బందీ ప్లానే వేసినట్టున్నారు. ఎంత చైన్ స్మోకర్లైనా లారీ లోడ్ సిగరెట్లను తాగుతారా ? అసలు విషయం ఏంటంటే హైదరాబాదులో నిన్న ఉదయం సిగరేట్ లోడుతూ వెళ్తున్న కంటైనర్ ని వెంబడించారు గుర్తు తెలియని దొంగలు. అచ్చు సినిమాల్లోలా ఛేజ్ చేసి చివరికి ఎలాగోలా లారీని ఓవర్ టేక్ చేసి ఆపి, డ్రైవర్ ని కొట్టి సుమారు 4 కోట్ల విలువైన సిగరెట్ లని వేరొక లారీ లోకి మార్చి ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేస్ లో హయత్ నగర్ పోలీసులకు డ్రైవర్ ను విచారించడం తప్ప వేరే ఆధారం లేకపాయె. అతని కాల్ లిస్ట్ మరియు జిపిఎస్ తెప్పించి విచారణ చేస్తున్నారు క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బృందం. ఎలాగైనా ఆ సిగరెట్ దొంగల అంతు చూడాలని పట్టుదలగా రంగంలో కి దిగారు 14 పోలీస్ టీంలు. ఇది ఖచ్చితంగా
అంతర్ రాష్ట్ర దొంగల పని అయి ఉంటుందని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినరని. ఎవరో మంచి దొంగల పనే అయి వుంటుందని కొందరనుకుంటున్నారట. మల్ల సిగరెట్ల ధరలు పెరిగిపోవడం వల్ల ఈ దొంగలకు చిరాకు పుట్టి పుక్యానికి కొట్టేద్దామనుకున్నట్టున్నారు. చూడాలి మరి పోలీసులు వాళ్ళను పట్టుకుంటే గానీ ఆ సిగరెట్ దొంగలు ఎలాంటివారో అనేది.