నగరిలో సినీ గ్లామర్..రోజాపై వాణీ విశ్వనాథ్ - MicTv.in - Telugu News
mictv telugu

నగరిలో సినీ గ్లామర్..రోజాపై వాణీ విశ్వనాథ్

March 19, 2022

15

ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గంలో రాజకీయం పరంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రానున్న రోజులలో నగరి నియోజకవర్గానికి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే రోజాపై.. సినీ నటి అందాల తార వాణీ విశ్వనాథ్ బరిలోకి దిగనున్నట్లు జనసేన సైనికులు పేర్కొన్నారు. అంటే నగరి నియోజకవర్గం పూర్తిగా సినీ గ్లామర్‌తో నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయన్న మాట. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా సినీ నటి రోజా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరిపై వాణీ విశ్వనాథ్ సైతం దృష్టి సారించారు.

ఈ నేపథ్యలో వచ్చే ఎన్నికల్లో తాను నగరి నుంచి పోటీ చేయబోతున్నానని వాణీ విశ్వనాథే స్వయంగా అన్నారు. ఇటీవలే ఆమె నగరిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా జనసేన సైనికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు నగరి నియోజకవర్గం పుత్తూరులో శనివారం జనసేన సైనికులు హంగామా చేశారు. వాణీ విశ్వనాథ్ బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. జనసేనలో చేరి ప్రజలకు సేవ చేయాలని బ్యానర్లపై రాశారు. వాణీ విశ్వనాథ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి పర్యటనలో భాగంగా వాణీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ”నగరితో తనకు అనుబంధం ఉంది. నా అమ్మమ్మ నగరిలో నర్సుగా పని చేశారు. ఆ అనుబంధంతో నేను నగరి ప్రజలకు మరింత దగ్గరవుతా”అని ఆమె అన్నారు.