Home > సినిమా > ప్రభాస్‌కు డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్‌కు గోపిచంద్ ఛాన్స్

ప్రభాస్‌కు డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్‌కు గోపిచంద్ ఛాన్స్

ప్రభాస్‌కు డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్‌కు గోపిచంద్ ఛాన్స్
X

మ్యాచో స్టార్ గోపీచంద్‌కు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తన లాస్ట్ సినిమా రామబాణం. అవకాశాల్లేని దర్శకుడు శ్రీవాస్ కు ఛాన్సన్ ఇవ్వగా.. ఆ సినిమా డిజాస్టర్ గా నిలించింది. తన మీద తనకు నమ్మకమో.. మరేమో కానీ శ్రీవాస్ తర్వాత శ్రీను వైట్లతో సినిమా లాంచ్ చేశారు గోపీచంద్. కానీ ఇప్పుడు మరో డిజాస్టర్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ దర్శకుడు మరెవరో కాదు రాధాకృష్ణ కుమార్.

ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ కు ఈయనే డైరెక్టర్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందరినీ తీవ్రంగా నిరాశపరించింది. దాదాపు 100 కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఏ హీరోతోనూ రాధాకృష్ణ సినిమా ఓకే చేయించుకోలేకపోతున్నాడు.



8 ఏండ్ల క్రితం గోపీచంద్ హీరోగా వచ్చిన జిల్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాధాకృష్ణ. ఆ తరువాత ప్రభాస్ తో రాధేశ్యామ్ మూవీ చేశాడు. ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దీంతో ప్రస్తుతం అతను ఖాళీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ సపోర్ట్ ఉండటంతో యూవీ క్రియేషన్స్ లోనే మూడో సినిమా చేసే ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గోపీచంద్ హీరోగా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్ కి రాధాకృష్ణ కథ కూడా చెప్పడం జరిగిందంట. అతనికి కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనికి సంబందించిన అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఫ్లాప్ సినిమాలు చేసే వెనుకబడిపోయిన దర్శకులకి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి గోపీచంద్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నట్లు ఉన్నాడు.




Updated : 20 Sep 2023 3:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top