సినీ ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ ఒక్కడేనా?: బొత్స - MicTv.in - Telugu News
mictv telugu

సినీ ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ ఒక్కడేనా?: బొత్స

October 11, 2019

 Balakrishna..

సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ ఒక్కడేనా? అని వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ అసోసియేషన్లకు చెందిన ప్రముఖులు వాళ్లకు అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు, లేదంటే లేదు.. అది వాళ్ల ఇష్టం అని తెలిపారు. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ ఇంతవరకు సీఎం జగన్‌ని కలవలేదన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. నాగార్జున, మోహన్ బాబు వచ్చి ఇటీవలే జగన్‌ని కలిసిన విషయాన్ని చెప్పారు.‘నాకు తెలియక అడుగుతున్నా.. సినిమా పరిశ్రమ అంటే బాలకృష్ణ ఒక్కడేనా? సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కలవడమంటే బాలకృష్ణ వచ్చి జగన్‌ని కలవాలా?’ అని బొత్స ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

అనంతరం ఇటీవల విడుదలైన చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం గురించి ఆయన మాట్లాడారు. సైరా విజయవంతం అయిందని.. ముఖ్యమంత్రిని కలుస్తానని చిరంజీవి కోరారు, అందుకు జగన్ కూడా సుముఖంగా స్పందించారు. ఓరోజు రమ్మనమని జగన్ చెప్పారని బొత్స తెలిపారు.