సినిమా థియేటర్లకు మళ్ళీ బ్రేక్.. - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా థియేటర్లకు మళ్ళీ బ్రేక్..

October 14, 2020

cinema theatres not opening from tomorrow

సినిమా థియేటర్లకు మళ్ళీ బ్రేక్ పడింది. అన్ లాక్ 5లో భాగంగా రేపటినుంచి సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరవాలా? వద్దా? అన్నదానిపై ఎగ్జిబిటర్లు చర్చలు జరిపారు. 

రేపటి నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు. థియేటర్లు తెరవాలంటే ఒక్కో దానికి రూ.10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్లు భావించారు. ఈ సందర్భంగా ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు ఎత్తివేయాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ లాక్ 5 మార్గదర్శకాల్లో సినిమా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో తెరవచ్చని తెలిపింది.