కుల,మతాలకు అతీతంగా ప్రియమణి పెళ్లి... - MicTv.in - Telugu News
mictv telugu

కుల,మతాలకు అతీతంగా ప్రియమణి పెళ్లి…

August 5, 2017

తెలుగు, తమిళ, మళయాల చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి . పెళ్లి పీటలు ఎక్కనుంది. కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ తో ఎంగెజ్ మెంట్ జరుపుకున్న ప్రియమణి. ఆగస్టు 23 న వివాహం చేసుకుంట్టున్నట్టు సమాచారం. ఈ వివాహాన్ని సింపుల్ గా రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుపుకోనున్నారట. రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా స్టార్ హోటల్ లో ఇస్తారని టాక్.

ప్రియమణి, ముస్తఫా రాజ్ తోలిసారి ఓ షో లో కలిసారట, ఆ పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బందంతో ఒక్కటికాబోతున్నారు. అయితే నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన ప్రియమణి అందర్ని ఆశీర్వదించమని కోరింది.అయితే కొందరు అభిమానులు శుభాకాంక్షలు చెప్పగా, మరికొందరు నెగిటివ్ లవ్ జీహాద్ పేరుతో కామెంట్స్ పెట్టారట . దీనితో ప్రియమణి కి ఆ కామెంట్లతో చిరాకు వస్తోందట. కొత్త జీవితాన్ని స్టాట్ చేయబోతున్నాని , కుదిరితే ఆశీర్వదించండి. కాని ఇలా బాధపెట్టే కామెంట్స్ చేయకండి అని కోరింది. పెళ్లి తరువాత కూడా మంచికథలు నచ్చితే సినిమాలలో నటిస్తాను అని ప్రియమణి తెలిపింది.