cirkus movie collection south movies dominating on bollywood
mictv telugu

150 కోట్లు పెడితే 25 కోట్లు కూడా రాలే.. పాతాళానికి బాలీవుడ్ ?

January 4, 2023

బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అన్నట్టు మారిపోయింది బాలీవుడ్ పరిస్థితి. రాజమౌళి ఎంట్రీకి ముందు ఇండియన్ బాక్సాఫీస్ పై బాలీవుడ్ స్టార్స్ ఆధిపత్యం కనపడేది. ముఖ్యంగా ఖాన్స్ త్రయం ఏకఛత్రాధిపత్యం స్పష్టంగా ఉండేది. సల్మాన్, షారుఖ్, అమీర్ వీరి సినిమాలు టాక్ కి సంబంధం లేకుండా కలెక్షన్స్ వసూల్ చేసేవి. అట్టర్ ఫ్లాప్ అయినా వారంలో వంద కోట్లు ఈజీగా వచ్చేవి. అయితే వన్స్ రాజమౌళి ప్రభంజనం స్టార్ట్ అయ్యాకా.. బాలీవుడ్ పై సౌత్ డామినేషన్ మొదలైంది. పాన్ ఇండియా కల్చర్ ఒక్కసారిగా బాలీవుడ్ ని కుదిపేస్తోంది. మనకి పోటీగా కంటెంట్ ఇవ్వడంలో బడా బడా దర్శకులు హీరోలు బాలీవుడ్ లో వరుసగా విఫలం అవుతున్నారు. వందల కోట్లు పెట్టి తీస్తే వంద కోట్లు కూడా దాట లేక చతికిలపడుతున్నారు. బాలీవుడ్ భారీ చిత్రాలు సామ్రాట్ ప్రిథ్వీరాజ్, శంషేరా, బ్రహ్మాస్త్రలు అట్టర్ ఫ్లాప్స్ అవ్వగా.. ఇప్పుడు తాజాగా మరో భారీ చిత్రం డిజాస్టర్ అయిపోయింది.

2022 పీడకల మిగల్చగా.. కనీసం 2023లో అయినా బాలీవుడ్ పుంజుకుంటుందా అంటే మరింత పాతాళానికి దిగజారిపోతోంది. బాలీవుడ్ నంబర్ వన్ కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, స్టార్ హీరో రణవీర్ సింగ్ ల తాజా భారీ చిత్రం సర్కస్ సినిమా తీవ్రంగా నిరాశపరించింది. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత నుంచి సినిమా ఏ మాత్రం కోలుకోలేదు. అలా 5 రోజుల్లో ఈ సినిమాకు కేవలం 25 కోట్ల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది. ఇక ఈ సినిమా కోలుకోవడం అసంభవం అని ట్రేడ్ తేల్చేసింది. అటు యూనిట్ కూడా ప్రచారం ఆపేసింది. రెండో వారం నుంచి ఇవ్వాల్సిన ప్రమోషనల్ బడ్జెట్ ను కూడా పూర్తిగా ఆపేసింది. ఈ సినిమాతో 200 కోట్ల రూపాయల వసూళ్లు ఆశించింది యూనిట్. కానీ వాళ్ల ఆశలు చెల్లాచెదురయ్యాయి. చివరికి దీపికా పదుకోన్, అజయ్ దేవగన్ ప్రత్యేక ఆకర్షణలు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి.