కానిస్టేబుల్ కూతురిపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం.. ఎన్‌కౌంటర్ చేస్తారా? - MicTv.in - Telugu News
mictv telugu

కానిస్టేబుల్ కూతురిపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం.. ఎన్‌కౌంటర్ చేస్తారా?

January 20, 2020

Head Constable.

సమాజానికి రక్షగా నిలవాల్సిన రక్షక భటులే నేరాలకు పాల్పడితే ఇంక సామాన్య జనాలకు రక్షణ ఎక్కడుంటుంది? కానిస్టేబుల్ కూతురిపై హెడ్ కానిస్టేబులే అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. నాలుగేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించాడు. చాక్లెట్ కొనిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పని చేస్తున్నప్పుడు అతనికి అతని కూతురైనా గుర్తుకురాలేదా? పోనీ తాను చేస్తున్న ఉద్యోగం ఎలాంటిదో అనే బాధ్యతైనా గుర్తుకురాలేదా? 

జగత్సింగ్‌పూర్ జిల్లాలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) లో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న తమిళనాడుకు చెందిన కందస్వామి పారదీప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టౌన్‌షిప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే తనతో పాటు విధులు నిర్వహిస్తున్న సహోద్యోగి నాలుగేళ్ల కూతురిపై కందస్వామి కన్నేశాడు. చాక్లెట్ కొనిస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన క్వార్టర్స్‌లోనే బాలికపై అఘాయిత్యం చేశాడు. ఈ దారుణాన్ని సదరు చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పడంతో కానిస్టేబుల్ అబయచందపూర్ పోలీస్ స్టేషన్‌లో కందస్వామిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.