ప్రమాదంలో ఉన్న ప్రథమ చికిత్స చాలా అవసరం. మనం చేసే ఫస్ట్‌ఎయిడ్ ఒక వ్యక్తి చావు బతుకుల్ని నిర్ణయిస్తుంది. అహ్మదాబాద్‌లో విమానశ్రయంలో కూడా ఇదే జరిగింది. గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ముంబై వెళ్లాల్సిన ప్రయాణికుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించి భద్రతా సిబ్బంది అతని ప్రాథమిక చికిత్స చేశారు. సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ కపిల్ రాఘవ్..సదరు ప్రయాణికుడికి సీపీఆర్ చేశారు. ఛాతి మీద చేతులతో కొడుతూ మళ్లీ అతని గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై ఓ జవాను షేర్ చేయగా వైరల్‌గా మారింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ సైతం తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.
Prompt action of CISF Jawan's saved a life at @ahmairport.
Salute to this great force 🙏 pic.twitter.com/miBP4g8Ft6— Sunil Deodhar (@Sunil_Deodhar) December 22, 2022
సీపీఆర్ అంటే ఏమిటి..
ఇటీవల ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతన్ననేపథ్యంలో వైద్యులు సీపీఆర్ ( కార్డియో పల్మోనరీ రిససిటేషన్) పై విస్తృత ప్రచారం చేశారు. హార్ట్ ఎటాక్‌కు గురైన వ్యక్తిని సీపీఆర్ చేసి బతికించ వచ్చని సూచనలు చేశారు. గుండెపోటు వచ్చిన సమయంలో గుండె పనిచేయడం మందగిస్తుంది. శరీర భాగాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. అలాంటి సమయంలో వ్యక్తి ఛాతిమీద చేతులతో ఒత్తిడి కలిగించి గుండె కొట్టుకునేలా చేయడమే సీపీఆర్. ఇలా చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తే ప్రాణాలకు ముప్పుతప్పుతుంది. అయితే గుండెపోటుకు గురైన వారికి తొలి 3 మూడు నిమిషాలలో సీపీఆర్ చేస్తేనే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సీపీఆర్‌పై రాజమౌళి వీడియో..
గతంలో గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ రెడ్డి మృతి చెందారు. ఈ సమయంలో గుండెపోటు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, దర్శకుడు రాజమౌళి కలిసి ఓ వీడియోను రూపొందించారు. దీనిలో గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేయడంపై అవగాహన కల్పించారు.