'జనగణమన', 'వందేమాతరం' పై హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందన ఇది.. - MicTv.in - Telugu News
mictv telugu

‘జనగణమన’, ‘వందేమాతరం’ పై హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందన ఇది..

November 6, 2022

 

Citizens should show equal respect to Jana Gana Mana, Vande Mataram: Centre

‘జనగణమన’ గీతం, ‘వందేమాతరం’ గేయానికి సమాన హోదా కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై కేంద్రం స్పందించింది. జాతీయ గీతం ‘జనగణమన’కి సమానమైన హోదాను ‘వందేమాతరం’ గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ… రెండింటికీ సమాన హోదా ఉందని, దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటినీ సమానంగా గౌరవించాలని పేర్కొంది.

‘జనగణమన’, ‘వందేమాతరం’ గేయానికి సమాన గౌరవం, హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని డిల్లీ హైకోర్టులో కొద్దిరోజుల క్రితం పిల్ దాఖలైంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రతిరోజూ వందేమాతరం, జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో రెండింటికి సమాన హోదా ఉంటుందని కేంద్రం కోర్టుకు తెలిపింది.