ట్రంప్‌‌కు గుడిసెలు కనిపించకుండా గోడ కడుతున్న గుజరాత్! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌‌కు గుడిసెలు కనిపించకుండా గోడ కడుతున్న గుజరాత్!

February 13, 2020

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు వస్తున్నారు. ట్రంప్  దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటన కోం గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లలో మునిగిపోయింది. ట్రంప్‌కు మురికి వాడలు కనిపించకుండా గోడ నిర్మించే పనిలో పడిందని సమాచారం. 

ఫిబ్రవరి 24న ట్రంప్ గుజరాత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గాంధీనగర్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. గాంధీనగర్‌కు వెళ్లే మార్గంలో దేవ్‌శరణ్ అనే మురికివాడ ఉంది. ఇక్కడ 500లకు పైగా గుడిసెల్లో 2,500 మంది నివసిస్తున్నారు. ఈ గుడిసెలు ట్రంప్‌కు కన్పించకుండా ఉండేందుకు రహదారి పొడవున దాదాపు అర కిలోమీటరు మేర 6 నుంచి 7 అడుగుల ఎత్తులో గోడ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత రహదారి వెంబడి మొక్కలు నాటుతామని సమాచారం. వీటన్నింటి కోసం దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.