ట్విస్ట్ : సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య.. అమ్మాయి కాదు - MicTv.in - Telugu News
mictv telugu

ట్విస్ట్ : సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య.. అమ్మాయి కాదు

June 1, 2022

మొన్న వెలువడిన సివిల్స్ ఫలితాల్లో మొదటి నాలుగు స్థానాల్లో అమ్మాయిలు నిలిచారని చదువుకున్నాం కదా. ఈ వార్త రాగానే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు. మహిళా సాధికారికత సాధ్యపడుతోందంటూ అభివర్ణించారు. చాలా వరకు పత్రికలు, వార్తా ఛానెళ్లు కూడా ఇలాగే రాశాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ వచ్చింది. ర్యాంకులలో మొదటి నాలుగు పేర్లు అమ్మాయిల పేర్లు ఉండడంతో అంతా నిజమేననుకున్నారు. కానీ, నాలుగో ర్యాంకు సాధించిన ఐశ్వర్య వర్మ అనే వ్యక్తి అమ్మాయి కాదు. అబ్బాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆయన ఫోటో పెట్టి మరీ స్పష్టతనిచ్చారు. ఐశ్వర్య వర్మది మధ్యప్రదేశ్ కాగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘మన రాష్ట్ర ఉజ్జయిని పట్టణానికి చెందిన ఐశ్యర్య వర్మ అనే పురుష అభ్యర్ధి నాలుగో ర్యాంకు సాధించడం అభినందనీయం’ అని నొక్కి, స్పష్టతతో వ్యాఖ్యానించారు. కాగా, ఐశ్వర్య వర్మ నాలుగేళ్లు ఢిల్లీలో కోచింగ్ తీసుకొని నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు.