తిరుమల కంటైన్మెంట్ జోన్ కాదు..పొరపాటు జరిగిందట - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల కంటైన్మెంట్ జోన్ కాదు..పొరపాటు జరిగిందట

July 9, 2020

bvdr

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుమలను ‘కంటైన్మెంట్ జోన్’ గా ప్రకటిస్తూ చిత్తూరు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేసిన సంగతి తెల్సిందే. చిత్తూరు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై టీటీడీ నుంచి అభ్యంత‌రాలు వస్తున్నాయి. దీంతో తిరుమ‌ల‌ను పొర‌పాటున కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించామ‌ని చెబుతూ జిల్లా అధికారులు మ‌రో ప్రకటన చేశారు. 

తిరుమల పేరు లేకుండా మళ్లీ కొత్త కంటైన్మెంట్ జోన్ జాబితాను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. దీంతో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ఆటంకం తొల‌గిపోయింది. తిరుమల కంటైన్మెంట్ జోన్ ప్రకటనపై మీడియాలో ప్రచారం జరగడంతో కలెక్టర్ ఆఫీస్ వెంటనే స్పందించింది. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా టీటీడీ ప్రస్తుతం ప‌రిమిత సంఖ్య‌లో ద‌ర్శ‌నాల‌కు అనుమతిస్తోంది. ప్ర‌స్తుతానికి రోజుకు పదివేల మందిని మాత్ర‌మే స్వామిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తుంది.