clarity of food and ingrediants
mictv telugu

ఆహారం-అపోహలు

December 29, 2022

clarity of food and ingrediants

మనం ఏపని చేసినా తిండి కోసమే చేస్తాం. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా మంచి ఆహారం, కంటినిండా నిద్రా ఇవే మనకు అల్టిమేట్ గా కావాల్సినవి. ఇవి ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం. కాబట్టి తిండి లేని రోజు మరకు ఉండదు. అలాగే అపోహ లేని ఆహారం కూడా లేదు. మనం ఏది తిన్నా అవతలి వాళ్ళు దాని మీద మనకు ఏదో ఒకటి చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువ అయిపోయింది. అది తింటే మంచిది కాదు, దీని వలన ఇలాంటి ిబ్బందులు వస్తాయి లాంటి హాఫ్ నాలెడ్జ్ జనాల్లో బాగా ఎక్కువ అయిపోయింది. దానికి తోడు మూడేళ్ళుగా వైరస్, జబ్బులు పీక్కుతింటున్నాయి. దాంతో ఏం తినాలన్నా జనాలు భయపడిపోతున్నారు. అన్ని రకాలు తింటేనే ఆరోగ్యంగా ఉంటా. మన శరీరానికి అన్నీ అవసరం. ఆరోగ్యకరమైన తిండి తినాలంటే ముందు దాని గురించి తెలియాలి. దాని చుట్టూ ఉన్న అపోహలు తొలిగిపోవాలి.

ఖరీదు:

ప్రతీదానిలోనూ ఇది అడ్డుకుంటూ ఉంటుంది. ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఉంటాయని చాలా మంది నమ్ముతుంటారు. అలాగే ఎక్కువ ఖరీదు పెట్టి కొన్నవే శుభ్రంగా ఉంటాయి అన్న నమ్మకమూ చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. ఉదాహరణకు ఆపిల్స్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయన్న భ్రమలో అవి ఎంత కాస్టలీ అయినా కొంటుంటారు. కానీ బొప్పాయిలో కూడా అంతే సమానంగా పోషకాలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోతుంటారు. బియ్యాల్లో, ఆకుకూరల్లో ఇలా చాలా వాటిల్లో ఈ అపోహలు ఉన్నాయి. అవి పక్కన పెట్టి ఎందులో ఏది ఉందో తెలుసుకుంటే ఖరీదుని పక్కన పెట్టి మనకు అందుబాటులో ఉండే వాటినే మంచి పదార్ధాలను తినొచ్చు.

మసాలా:

మసాలాలు, కారాలు మంచివి కావనే అపోహ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ తింటే అల్సర్లు, బీపీలు వస్తాయని అనుకుంటుంటారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. అల్సర్లు, బీపీలు మన ఆహారపు అలవాట్ల వలన, ఒత్తిడి వలన వస్తాయి. ఒకసారి ఎటాక్ అయ్యాక వాటిని తినకూడదు అన్నమాట వీస్తవమే కానీ ఏవో వస్తాయని తినడం మాత్రం మానేయక్కర్లేదు. అయితే ఏదీ అతిగా తినకూడదు అన్నమాటను మాత్రం గుర్తుపెట్టుకోవాలి.

పాలకూర-టమాటా:

ఇదో పెద్ద మిత్. పాలకూర, టమాటా కలిపి తింటే ఏదో అయిపోతుంది అని చెప్తుంటారు చాలా మంది. నిజానికి ఈ రెండూ కలిపి తింటే ఏమీ అవ్వదు. రెండింటినీ కలిపి కూర చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాలకూర, టమాటాల్లో ఆక్సలేట్ అనే రసాయనం ఉంటుంది. ఈ రెండూ కలపడం వలన కాల్షియం ఆక్సలేట్ అనే రసాయనం పేరుకుని అవి రాళ్ళల్లా మారతాయి. వాటినే కిడ్నీలో రాళ్ళు అంటారు. కానీ అది ఎవరికి అంటే అస్సలు శారీరక శ్రమ లేని వారికి మాత్రమే. కూర్చుని పని చేసే వాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు వీటిని కలిపి తినకూడదు కానీ అందరూ కాదు.

నూనెలు, నూనె పదార్ధాలు:

నూనె లేకుండా తినడం మంచిది అని అందరూ చెప్పే మాట. అస్సలు నూనె లేకుండా తింటే ఆరోగ్యమే ఆరోగ్యం అని కూడా చెబుతారు. కానీ భారతీయ వంటకాలకు నూనె లేకుండా సాధ్యం కాదు. రుచి కూడా ఉండవు. నిజానికి నూనెల నుంచి వచ్చే పోషకాలు, శక్తి,, క్యాలరీలు మన శరీరానికి చాలా అవసరం. దీనివల్ల వచ్చే క్యాలరీల్లో కనీసం 20శాతం నూనె నుంచి వచ్చేవి మనకు చాలా అవసరం. ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరిగేట్టటు చేస్తాయి. ఎ, బి, ఇ, కె విటమిన్లు కొవ్వులోనే కరుగుతాయి. కాబట్టి నూనె, అందులో కొవ్వు మనకు చాలా అవసరం. ఎక్కువ తినకూడదు కానీ అస్సలు మానేయడం కూడా మంచిది కాదు.

నీళ్ళు:

వాటర్ ఎంత తాగితే అంత మంచిది. రోజుకు 4 లేదా 5 లీటర్ల నీళ్ళు తాగాలి అని చెబుతుంటారు. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు. మనం రోజు రెండున్నర నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తాగితే సమస్యలే వస్తాయి తప్ప పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మనం నీళ్ళు ఒక్కటే తాగము. దాంతో పాటూ లిక్విడ్ పదార్ధాలను కూడా రోజులో చాలానే తీసుకుంటాము. కానీ వాటిని ఎవ్వరూ లెక్కపెట్టరు. లేవగానే లీటర్, రెండు లీటరల్ నీళ్ళు తాగేయాలని కూడా చెబుతుంటారు. కానీ అలా చేయడం వలన జీర్ణప్రక్రియ దెబ్బ తింటుంది. ఒక్కసారే అన్ని నీళ్ళు తాగకూడదు. రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా లివర్ ప్రాబ్రెమ్ ఉన్నవాళ్ళఉ నీళ్ళు అస్సలు తాగకూడదు. డాక్టర్లు చెప్పినట్టు తీసుకోవాలి.

నెయ్యి, బటర్, ఛీజ్:

ఈ మూడు పదార్ధాలు అస్సలు తినొద్దు అంటారు. ఇది మాత్రం ఎవ్వరు చెప్పినా వినకండి. ఈ మూడు మంచి కొలెస్ట్రాల్ ను ఇచే పదార్ధాలు. నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్ ఎ కూడా ఉంటుంది. మన శరీరానికి హెల్తీ ఫ్యాట్ చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలు, ఆటలు ఆడేవారు ఇవి ఎంత తింటే అంత మంచిది.వయసు వచ్చిన వాళ్ళు, అస్సలు కదలని పెద్దవాళ్ళు అయితే యాత్రం తినకుండా ఉండడమే మంచిది. ఇది కొంచెం లేట్ గా అరుగుతుంది కాబట్టి వాళ్ళు దీన్ని తగ్గించడమో, మానేయడమో చెయ్యాలి.

పంచదార:

సుగర్ తినడం వలన డయాబెటీస్ వస్తుంది అనేది వట్టి అపోహ. ఆల్రెడీ ఉన్నవాళ్ఉళ దీన్ని తినకూడదు కానీ సుగర్ తింటే మాత్రం డయాబెటీస్ రాదు. అసలు డయాబెటీస్ మనం తినే పదార్థాల నుంచి, జెనిటికల్ గా వచ్చే వ్యాధి.మనం ఏ పదార్ధం తీసుకున్నా అది షుగర్ కింద మారుతుంది. ముఖ్యంగా పిండి పదార్ధాల వలన. అయితే డయాబెటీస్ వచ్చిన తర్వాత మాత్రం అస్సలు తినకూడదు అన్నమాట మాత్రం పచ్చి నిజం.

ఉప్పు:

మన ఆరోగ్యానికి ఉప్పు పెద్ద ముప్పు అని భావిస్తారు. అస్సలు మంచిది కాదు అని కూడా చెబుతారు. కానీ మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది ఉప్పే. రోజుకు కనీసం నాలుగు గ్రాముల ఉప్పు మనం తీసుకోవాలి. అయితే మనం తీసుకునే చాలా కూరగాయల్లో, గుడ్డులో ఉప్పు ఉంటుంది కాబట్టి అదనంగా అస్సలు అక్కర్లేదు అనుకుంటారు. నిజానికి ఆహారపదార్ధాల్లో వచ్చే ఉప్పు కాకుండా నాలుగు గ్రాముల ఎక్సట్రా ఉప్పు మనం తీసుకోవాలి. ఒంట్లో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత సజావుగా సాగాలంటే ఉప్పు చాలా అవసరం. డీహైడరేషన్ అవ్వకుండా ఉండాలన్నా కూడా ఉప్పే కావాలి.

ప్రొటీన్లు:

ప్పుల్లో, మాంసంలో ప్రోటీన్లు ఉంటాయి ఇది చాలా మందికి తెలిసి విషయమే. అయితే మనం పప్పులు తింటే చాలు మాంసం అక్కరలేదు అనుకుంటారు. కానీ నిజానికి రెండు రకాల పదార్ధాలు మన శరీరానికి అవసరం. పప్పుల్లో ఉండే ప్రొటీన్లతో పాటూ పిండిపదార్ధాలు మనకు అవసరమైన శక్తిని ఇస్తే, మాంసకృతులు కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. ఎన్నుడైతే పిండిపదార్ధాలను తగ్గించేసి మాంసకృతులే తినటం మొదలుపెడతామో అప్పుడు శరీరం మాంసకృతులను కండర నిర్మాణానికి కాకుండా శక్తి కోసం వాడుకోవడం ప్రారంభిస్తుంది. దీంతో శారీరక, కండర నిర్మాణం వెనుకబడుతుంది. దీనివల్ల ప్రొటీన్ల లోపం తలెత్తుతుంది. అలాగే మంస్ం తినకుండా కేవలం ప్పులే తింటే కూడా కండ నిర్మాణం బలంగా ఉండదు. కాబట్టి రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.

రాత్రి తిండి:

రిత్రిపూట తిండి ఎక్కువ తింటే బరువు పెరుగుతారని అంటారు. ఇది నిజమే కానీ మనం రోజు మొత్తంమీద తినే తిండి దానివల్ల క్యాలరీలు మూడుపూట్లా తినే భోజనాల నుంచి సమానంగా ఒంటికి దక్కడం మంచిది. రాత్రిపూట అస్సలు తినకుండా ఉండటం మంచిది కాదు. బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా, లంచ్ మామూలుగా, డిన్నర్ తక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే తిన్న తర్వాత వెంటనే నిద్ర పోకుండా ఉంటే ఎంత తిన్ని పర్వాలేదు. డిన్నర్ కూ, పడుకోవడానిక మధ్య రెండు గంటలు టైమ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తే కూడా చాలా మంచింది.

ఇక కూరగాయలలను కట్ చేయకముందే కడితేనే మంచిది. కట్ చేసిన తర్వాత కడగడం, నానబెట్టడం లాంటివి చేస్తే అందులో ఉండే బీకాంప్లెక్స్ విటమిన్లు, పోటాషియం లాంటి ఖనిజాలన్నీ నీళ్ళల్లో కలిసిపోయి ఒట్టి చెత్త మిగుతులంది. కాబట్టి కూరగాయలను ముందే శుభ్రంగా కడిగేసి తర్వాత కట్ చేసుకుని మంచిగి వండుకుని తినాలి.