పెళ్లి వార్తలపై స్పష్టత ఇచ్చిన కీర్తి సురేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి వార్తలపై స్పష్టత ఇచ్చిన కీర్తి సురేశ్

April 5, 2020

Clarity on actress keerthi suresh marriage

‘మహానటి’ కీర్తి సురేష్ త్వరలో పెళ్లికి సిద్దమైనదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. బీజేపీ నేతతో ఆమెకు పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి ఘనంగా జరగబోతోందని, ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని రకరకాల వార్తలు గత రెండు మూడు రోజులుగా ఇటు ప్రధాన మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 

అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కీర్తి స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలను ఖండించింది. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చిచెప్పింది. తప్పుడు వార్తలు వ్యాపింప చేయవద్దని కోరింది. మరో ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చానని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని ప్రశ్నించింది.