జేఎన్‌యూలో ఘర్షణ.. ఆరుగురికి తీవ్రగాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

జేఎన్‌యూలో ఘర్షణ.. ఆరుగురికి తీవ్రగాయాలు

April 11, 2022

 ashok

శ్రీరామ నవమి సందర్భంగా రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగి, ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం.. యూనివర్సిటీ మెస్‌లో మంసాహారం వడ్డించటంతో ఈ ఘర్షణ జరిగినట్టు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జేఎన్‌యూలో శ్రీరామ నవమి రోజున మంసాహారం వడ్డించటంపై రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు సంఘటన స్ధలానికి చేరుకొని, ఇరుసంఘాల విద్యార్థులను అదుపు చేశారు.

అనంతరం గాయపడిన విద్యార్థులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన సంఘం విద్యార్థులు.. ఏబీవీపీ విద్యార్థులు తమపై దాడి చేశారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గాయపడిన విద్యార్థులను యూనివర్సిటీ ఉపకులమతి, పలువురు అధ్యాపకులు వెళ్లి, పరామర్శించారు. ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు చేపడుతామని, విద్యార్థులు అందరు శాంతియుతంగా ఉండాలని కోరారు.

ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ”మాపై దాడిచేసిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకోవటం లేదు. వారిపై చర్యలు తీసుకునే వరకు నిరసనలు, ఆందోళనలు చేస్తాం” అని యూనివర్సిటీ గేట్ వద్ద నిరసనకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు.