Clash between Congress and BJP workers in Tungapadu
mictv telugu

కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా రేవంత్ పాట.. తీవ్ర ఉద్రిక్తత

September 6, 2022

Clash between Congress and BJP workers in Tungapadu

మూడు ప్రధాన పార్టీలకు సవాలుగా మారిన మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ – కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

నాంపల్లి మండలం తుంగపాడు గ్రామంలో పార్టీలో చేరికల సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు కోమటిరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా పక్కనే వినాయక మండపం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటను కాంగ్రెస్ కార్యకర్తలు ప్లే చేశారు. అంతేకాక, సౌండ్ ఎక్కువ పెట్టి అంతరాయం కలిగించడంతో పాటను ఆపమని బీజేపీ కార్యకర్తలు కోరారు. అయినా పట్టించుకోకుండా దురుసుగా సమాధానమివ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో చేసేదేమీ లేక రాజగోపాల్ రెడ్డి అక్కడ నుంచి వెనుదిరిగారు.