పంజాబ్ లోని పాటియాలలో సోమవారం జరిగిన ఘర్షణలో పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్ధి మరణించాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన విద్యార్థినిని జిల్లాలోని నభా సమీపంలోని సంగత్ పూర్ గ్రామానికి చెందిన ఆరో సెమిస్టర్ విద్యార్థి నవజోత్ సింగ్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన విద్యార్థి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ విద్యార్థి.
Punjab | A scuffle erupted between 2 groups at Patiala University in which one student died & two were injured.
We received information that a boy named Navjoot Singh, a student of B. Tech's 2 yr was earlier stabbed with a knife: Jaswinder Singh Tiwana, DSP, Patiala pic.twitter.com/wYOmX0mocc
— ANI (@ANI) February 27, 2023
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..క్యాంపస్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఇంజనీరింగ్ విభాగానికిచెందిన విద్యార్థిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థి అక్కడే కుప్పకూలిపోయాడు. ఘర్షణ గురించి సమాచారం అందుకున్న యూనివర్సిటీ భద్రతా సిబ్బంది…పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ విద్యార్థి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.