పొట్టుపొట్టుగా కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

పొట్టుపొట్టుగా కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు

November 1, 2022

Clash between TRS and BJP workers during Rajagopal Reddy's campaign

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో పంతంగిలో ప్రచారం ముగిసిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి సైదాబాద్‌ వెళ్లారు. అక్కడ టీఆర్ఎస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బీజేపీ జెండా కర్రను విసరడంతో సుశీల అనే టీఆర్ఎస్ మహిళా కార్యకర్తకు గాయమైంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.

Clash between TRS and BJP workers during Rajagopal Reddy's campaign
అనంతరం ప్రచారంలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి రెడ్డిబావి గ్రామం మీదుగా ఆరెగూడం వెళ్లారు. అక్కడ ప్రసంగం ముగించే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరోసారి పరిస్థితి అదుపు తప్పింది. రాళ్లు విసిరిన నిందితుల్ని పట్టుకోవాలని బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాసేపటి తర్వాత ఏసీపీ ఉదయ్‌రెడ్డి హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.