అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. మంటల్లో చిక్కుకున్న ఎస్ఐ - MicTv.in - Telugu News
mictv telugu

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. మంటల్లో చిక్కుకున్న ఎస్ఐ

March 31, 2022

bnnv

రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో రెచ్చిపోయిన ఒక వర్గం వారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడులో జరిగింది. ఈ సందర్భంగా రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పెట్టిన మంటలు ఎస్ఐకి అంటుకున్నాయి. దీంతో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మొహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కాగా, అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అంశమే వివాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాలు ఇంకా అందాల్సి ఉంది.