ఢిల్లీ అల్లర్లు..సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ అల్లర్లు..సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

February 26, 2020

ccc ncvn vv

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. 

స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారు. ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ పరిధిలోని 86 పరీక్షా కేంద్రాల్లో బుధవారం జరగాల్సిన పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష, 12వ తరగతి వెబ్ అప్లికేషన్ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కర్నాల్ నగర్, జాఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్ బాగ్‌‌,కర్వాల్, బాబర్‌పూర్‌లో 144 సెక్షన్ విధించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అన్నీ టీవీ స్టేషన్‌లకు కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ అడ్వైజరీ జారీ చేసింది. రెచ్చగొట్టే కథనాలను, అసత్య ప్రచారాలను ప్రసారం చేయకూడదని సూచించింది.