5వ తరగతే కానీ మహాముదురు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

5వ తరగతే కానీ మహాముదురు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి

November 28, 2019

Class 5 boy writes letter to Kerala police for delay in cycle repair

సాధారణంగా పిల్లలు పోలీసులంటేనే బయపడతారు. అలాంటిది ఐదవ తరగతి పిల్లాడు ఒకడు ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా నోట్‌బుక్ నుంచి ఓ పేజీ చించిపడేసి ఫిర్యాదు కెలికి ఏకంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కేశాడు. కేరళలోని  కోజికోడ్ జిల్లాలోని మెప్పయూర్ పోలీసులకు అబిన్ అనే పిల్లాడు ఫిర్యాదు రాశాడు. పోలీసులు కూడా పెద్ద కేసే అన్నట్టు స్పందించి విచారణ చేపట్టారు. 

అబిన్ ఎలింబిలాడ్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. అబిన్, అతడి తమ్ముడు ఓ సైకిల్ షాపులో తమ సైకిల్‌ను రిపేర్‌కు ఇచ్చారు. రోజులు గడుస్తున్నా సైకిల్ రిపేర్ చేయలేదు. దీంతో అన్నదమ్ములిద్దరూ మెకానిక్‌కు ఫోన్ చేసినా సైకిల్ దుకాణందారు  పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. 

దీంతో అబిన్‌కు కోపం వచ్చింది. నోట్‌బుక్ తీసుకొని ఓ పేజిపై కంప్లైంట్ రాసేసి నవంబర్ 25న మెప్పయూర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చాడు. ‘నా సైకిల్ రిపేర్ కోసం ఓ షాపు యజమానికి 200 రూపాయలు ఇచ్చాను. రోజులు గడుస్తున్నా నా సైకిల్ రిపేరు కాలేదు..’ లేఖలో చెప్పాడు. అబిన్ లెటర్ చూసిన పోలీసులు తొలుత ముచ్చటపడ్డారు. తరువాత సీరియస్‌గా తీసుకొని అబిన్ కంప్లైంట్‌కు రిజిస్టర్‌లో ఓ నెంబర్ కేటాయించారు. షాపు మెకానిక్‌ని కలిసి దర్యాప్తు చేశారు. తన కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉండి సైకిల్ రిపేర్ కుదరలేదని వివరణ ఇచ్చాడు. ఆ తరవాత అబిన్ సైకిల్‌కు రిపేర్ చేసి ఇచ్చాడు. ప్రస్తుతం అబిన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.