Classmates throwing a sixth-grader into a fire
mictv telugu

కుల చిచ్చు.. ఆరో క్లాస్ విద్యార్ధిని మంటల్లో నెట్టేసిన క్లాస్‌మేట్స్

May 11, 2022

Classmates throwing a sixth-grader into a fire

ఇప్పటివరకూ పెద్ద వాళ్లకే పరిమితమనుకున్న కుల జాఢ్యం ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పాకింది. కులం పేరుతో తోటి విద్యార్ధులే ఓ బాలుడిని మంటల్లో తోసేశారు. దాంతో వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లా దిండివనం ప్రభుత్వ పాఠశాలలో బాధిత బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. అదే స్కూలులో నిందిత బాలురు కూడా చదువుతున్నారు.

ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం బాధిత బాలుడు నానమ్మ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి బయటికి వెళ్లాడు. వెళ్లిన కాసేపటికే ఒంటిపై కాలిన గాయాలతో తిరిగి వచ్చాడు. ఏమైందని అడిగితే మొదట అబద్దం చెప్పిన బాలుడు గట్టిగా నిలదీసేసరికి నిజం చెప్పేశాడు. తనతో చదివే ముగ్గురు అగ్రవర్ణ విద్యార్ధులు కులం పేరుతో దూషించారని, ఒంటరిగా వెళ్తుండడం చూసి మరోసారి తిట్టి నిప్పుల్లోకి తోసేశారని వెల్లడించాడు. మంటలు అంటుకోవడంతో వెంటనే సమీపంలోని చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముగ్గురు అగ్రవర్ణ బాలుర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధిత బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.