భారత్‌లో గూగుల్ విభిన్న సేవలను ఉపయోగించే వేలాది మంది వినియోగదారులు ఉన్నారు. ఈ సౌకర్యాలలో జీమెయిల్ ఒకటి. ఏదైనా అధికారికంగా మెయిల్ పంపించేందుకు జీమెయిల్ ఉపయోగిస్తుంటారు. గూగుల్ తన డిస్క్ జిమెయిల్ తోపాటు మరిన్నింటిలో ఫైల్ లను సేవ్ చేసుకునేందుకు 15జిబి ఫ్రీ స్టోరేజీ డేటాను ఇస్తుంది. ఈ స్టోరేజీ ఫుల్ అయినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో మీరు స్టోరేజ్ ప్లాన్ ను కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్టోరేజీ పెంచడానికి అవసరంలేని ఫైల్స్ ను డిలీట్ చేయవచ్చు. అయితే స్టోరేజీని ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీమెయిల్ ఎలా స్టోర్ ఫుల్ అవుతుంది:
గూగుల్ అకౌంట్ యూజర్స్ ఇమెయిల్‌లు, ఫోటోలు, ఫైల్లు మొదలైన వాటి కోసం డేటాను నిల్వ చేయడానికి 15GB ఫ్రీ స్టోరేజిని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫ్రీ స్టోరేజీలో ఇమెయిల్‌లు, ఫోటోలు, పత్రాలతో గూగుల్ మీకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది. దీనిలో మీరు మరింత నిల్వను కొనుగోలు చేయవచ్చు లేదంటే పాత ఫైల్స్ ను డిలీట్ చేసుకోవచ్చు.
స్టోరేజీకోసం అందుబాటులో ప్లాన్స్:
స్టోరేజ్ ఆప్షన్ కింద, క్లౌడ్‌లో ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వినియోగదారుల కోసం గూగుల్ అనేక ప్లాన్లను కలిగి ఉంది. కానీ స్టోరేజ్ ప్లాన్లు నెలవారీ బిల్లింగ్ సైకిల్‌తో 100GBకి రూ.130 నుండి ప్రారంభమవుతాయి. అందువల్ల, స్టోరేజీని ఉపయోగించడానికి వినియోగదారులు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది.
స్టోరేజీ ఖాళీ చేయవచ్చు:
కొన్ని టిప్స్ ద్వారా మీరు మీ జీమెయిల్ స్టోరేజీని ఖాళీ చేయవచ్చు.
– స్పామ్ లేదా అవాంఛిత ఇమెయిల్‌లను ఒకేసారి ఎలా తొలగించాలి.
-ముందుగా మీ PC లేదా మొబైల్ ఏదైనా బ్రౌజర్లో Gmailని తెరవండి.
-ఇప్పుడు మీరు ఇమెయిల్‌ను తొలగించాలనుకుంటున్న ఇన్‌బాక్స్/సోషల్/స్పామ్ ఫోల్డర్ లేదా ఫోల్డర్లకు వెళ్లండి.
-ఆపై ఎగువ ఎడమవైపు ఉన్న క్రింది బాణంపై క్లిక్ చేయండి.
-ఇప్పుడు మీరు తొలగించాలనుకుంటున్న సందేశాలను ఎంచుకోండి లేదా చెక్ బాక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా అన్ని సందేశాలను ఎంచుకోండి.
-ఇప్పుడు తొలగించుపై క్లిక్ చేయండి.
-సందేశం ట్రాష్ ఫోల్డర్‌కు పంపబడుతుంది.
మీ ఇన్‌బాక్స్ నుండి చదవని మెయిల్స్ ఎలా డిలీట్ చేయాలి:
-ముందుగా మీ బ్రౌజర్లో Gmailని తెరవండి.
– కేటగిరిలోకి వెళ్లి చదవని లేబుల్ లేదా రీడ్ లేబుల్‌ని ఎంచుకుని, ఎంటర్ నొక్కండి. జీమెయిల్ మీ చదవని లేదా చదివిన ఇమెయిల్లన్నింటినీ చూపుతుంది.
-సందేశం ఎగువన ఉన్న ‘ఆల్ సెలక్ట్’ బాక్స్‌పై క్లిక్ చేసి, ఆపై ‘ఈ శోధనకు సరిపోయే అన్ని సంభాషణలను ఎంచుకోండి’.
-ఇప్పుడు మీ అన్ని ఇమెయిల్‌లను తొలగించడానికి ఎగువన కనిపించే చిహ్నంపై క్లిక్ చేయండి.