ఓ మనిషీ ఇటు చూడు.. టాయిలెట్‌లో పోస్తున్న ఆవులు - MicTv.in - Telugu News
mictv telugu

ఓ మనిషీ ఇటు చూడు.. టాయిలెట్‌లో పోస్తున్న ఆవులు

September 15, 2021

Climate Researchers Potty Train Peeing Cows

‘ఇక్కడ మూత్రం పోయరాదు..’ అని ఎక్కడ రాస్తే అక్కడికి పనిగట్టుకుని వెళ్లి మరో పోస్తుంటారు కొందరు. ‘పోయరాదు..’ అనే పదంలోంచి దు ను తీసేసే తుంటరులు మరికొందరు. టాయిలెట్లు లేనిచోటే కాదు, ఉన్న చోట కూడా వాటిలోకి వెళ్లకుండా ప్రకృతి పిలుపుకు స్పందించేవారు కోకొల్లలు. అలాంటివారికంటే తాము వందల రెట్లు మేలని నిరూపించుకుంటున్నాయి కొన్ని ఆవులు.

జర్మనీలో కొన్ని ఆవులు బుద్ధిగా, పద్ధతిగా టాయిలెట్‌కు వెళ్లి మూత్రం పోసి వస్తున్నాయి. ఎంత అర్జంట్ అయినా బిగబట్టుకుని.. నాలుగు గోడల మధ్యే ప్రకృతి పిలుపుకు స్పందిస్తున్నాయి. అది వాటంతట వాటికి పుట్టిన బుద్ధి కాదు. కొందరు పరిశోధుకులు వాటికి అలా ట్రైనింగ్ ఇచ్చారు. రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫార్మ్ యానిమల్ బయాలజీకి చెందిన డెయిరీ ఫార్మ్‌లో 16 ఆవులకు టాయ్‌లెట్‌ను వాడుకోవడోం శిక్షణ ఇచ్చారు. గ్రీన్ హౌస్ వాయువును అరికట్టే చర్యల్లో భాగంగా ఈ పరిశోధన నిర్వహిస్తున్నారు.

ఎలా ట్రైన్ చేశారంటే..

ఆవులకు వాటి టాయిలెట్‌లో తాయిలం చూపారు. అక్కడ మూత్రం పోసిన ప్రతిసారీ గడ్డి పెట్టారు. ఎన్నిసార్లు మూత్రం పోస్తే అన్నిసార్లు తిండి పెట్టారు. దీంతో అక్కడికెళ్లి సుస్సు పోస్తే కడుపుకింత పెడతారని వాటికి అర్థమై ఆ రూల్ ను ఫాలో అవుతున్నాయి. పర్యావరణానికి కీడుచేసే హరిత వాయువుల్లో 19 శాతం పశువుల ద్వారానే గాలిలో కలిసిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి ఈ మంత్రం వేశారన్నమాట. దీని కోసం డిజైన్ చేసిన టాయిలెట్ పశువులు మూత్రంలో 80 శాతం గ్రహించి అమ్మోనియం వాయువును 56 శాతం తగ్గిస్తుందని పరిశోధకులు చెప్పారు.