యాడ్స్‌పై 289 కోట్ల ఖర్చు.. ఒక్క సీటూ గెలవలేదు - MicTv.in - Telugu News
mictv telugu

యాడ్స్‌పై 289 కోట్ల ఖర్చు.. ఒక్క సీటూ గెలవలేదు

May 20, 2019

ఆస్ట్రేలియాలో శనివారం ముగిసిన ప్రధాని ఎన్నికల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన క్లివ్ పాల్మెర్ అనే కోటీశ్వరుడు రాజకీయ పార్టీని స్థాపించి ఈ ఎన్నికల బరిలో నిలిచాడు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేసిన పాల్మెర్ కేవలం ఎన్నికల ప్రకటనలపై అక్షరాలా 289 కోట్లు ఖర్చు చేశాడు. ఆ డబ్బులతో దేశమంతా ప్రకటనలు ఇచ్చాడు. ఇంత హడావిడి చేసినా కూడా పాల్మెర్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువకపోవడం ఇప్పుడు సంచలనం అవుతుంది. అన్ని కోట్లు ప్రకటనలపై ఖర్చు పెట్టినా ఒక్క సీటు కూడా గెలువకపోవడంతో అందరు పాల్మెర్‌కు సానుభూతి తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పడం మరో సంచలనం. ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ, అవి తప్పని ఫలితాల అనంతరం తేలింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకున్న మోరిసన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ సంకీర్ణం అనూహ్య ఫలితాలను సాధించింది. 1.60 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ప్రతిపక్ష లేబర్ కూటమి మొత్తం 151 స్థానాల్లో 82 సీట్లు గెలుచుకుంటుందని పోల్స్ వెల్లడించాయి.