నగరంలో శుక్రవారం రాత్రి అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. జగ్నేకీ రాత్‌గా పిలిచే షబ్ – ఎ – బరాత్ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు ఝాము వరకు ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. గ్రీన్‌ల్యాండ్, లంగర్ హౌస్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా అన్నీ మూసి ఉంటాయని, ప్రయాణీకులు, వాహన దారులు గమనించాలని కోరారు. మరోవైపు హోళీ పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.