జాన్ మేరా జాన్...తు హే-మేరా జాన్..అంటోన్న జానా... - MicTv.in - Telugu News
mictv telugu

జాన్ మేరా జాన్…తు హే-మేరా జాన్..అంటోన్న జానా…

June 7, 2017

కేసీఆర్ కు జానారెడ్డికి మధ్య ఏదో తెలియని లవ్ స్టోరీ నడుస్తున్నట్టు ఉంది. కేసీఆర్ అసెంబ్లీలో బయటపెడితే..జానారెడ్డి పబ్లిక్ లోనే తన ప్రేమ వ్యక్తం చేశారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం వీరి మధ్య ఉన్న వెరైటీ వీరప్రేమగాథను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతకీ వీళ్ల లవ్ లోతుల్లోకి పోతే…

కాంగ్రెస్ లో జానారెడ్డి రూటే సెపరేట్. ఫులిస్టాప్ లేకుండా మాట్లాడినా…అర్థం అయినా కాకపోయినా అందులో ఏదో ఉంటుంది. అసెంబ్లీలోనైనా..బయటైనా ఆయనంతే. జీహెచ్ ఎంసీ 5 రూపాయల భోజనం తిన్నా… యాద్రాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నా.. సంథింగ్ స్పెషల్. విపక్షంలో ఉన్నా స్వపక్షానికి బూస్ట్ నిచ్చేలా ఆయన మాటలుంటాయి. ఇలా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు. క్యాజువల్ గా మాట్లాడిన ఆ వ్యాఖ్యలు కేసీఆర్ కు, తెలంగాణ వాదులకు నచ్చేలా ఉంటాయి. ఇంతకీ జానా మాటల్లో మర్మం ఏంటీ…
మైక్ పట్టారంటే కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కార్ పై ఒంటికాలుపై లేస్తారు. ఏదీ సరిగ్గా చేయడం లేదంటూ విరుచుకుపడుతారు. కాంగ్రెస్సే కాదు.. మిగతా విపక్ష నేతలు ఇంతే. కానీ విపక్ష నేతల్లో జానారెడ్డి మాత్రం వేరు. సర్కార్ మంచిపనులు చేస్తుంటే ఆయన మనస్సు అస్సలు ఊరుకోదు.మోహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. నచ్చని పనులుంటే ఇదేం బాలేదంటుంటారు. ఇలాంటి ఆయన వైఖరే అప్పడప్పుడు అలా పార్టీ నేతలకు అర్థం కాదు.. విపక్షంలో ఉండి స్వపక్షానికి సపోర్ట్ చేయడం ఏంటీ అని కాంగ్రెస్ నేతలు అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈయన మాటలతో గులాబీ నేతలు ఖుషీ అయిన రోజులు ఉన్నవి.
తాజాగా యాద్రాద్రి వెళ్లిన సీఎల్పీ నేత జానారెడ్డి నరసింహస్వామిని ఏమి కోరుకున్నారో తెలుసా… ఆయన కుటుంబం ఆనందంగా ఉండాలనో..రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనో కాదు… ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని కోరుకున్నారు.సో లీడరంటే నువ్వే..
రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. సకాలంలో పనులు పూర్తిచేసి భక్తులకు దర్శనం కల్పించాల్సిందిగా సూచించారు. అంతేకాదు ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడంలేదని.. బాధితులే కోర్టులకు వెళుతున్నారన్నారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తికావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎడికెళ్లినా..ఏం మాట్లాడినా…అందుకే నువ్వు కేసీఆర్ తెగ నచ్చేశావ్. ప్రాజెక్టులపై మీ పార్టీ నేతలంతా చిటపటలాడుతున్నా… కేసీఆర్ ను మనస్సును అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని నరసింహస్వామిని కోరుకున్నట్టు ఉన్నారు. అసెంబ్లీలోనే కాదు బయటకూడా మాటల మ్యాజిక్ తో కేసీఆర్ ని పడేస్తున్నారు. జానా నువ్వు నిజంగా సూపర్..నీలాంటోళ్లు విపక్షంలో ఉంటే కేసీఆర్ మరో టర్మ్ కాదు…రెండు టర్మ్ లైనా బంగారు తెలంగాణకోసం విశ్రమించారు.