తెలంగాణలో క్లస్టర్ పద్దతి.. ఒక కళశాలలో చేరి మరో కళశాలకు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో క్లస్టర్ పద్దతి.. ఒక కళశాలలో చేరి మరో కళశాలకు

May 24, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని విధానాన్ని విద్యాశాఖలో ప్రవేశపెడుతున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న పది అటానమస్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి, క్లస్టర్ విధానానికి తెరలేపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విధానంపై సోమవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.ఆర్. లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్ సమక్షంలో ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లతో ఓయూలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు.

”తెలంగాణలో క్లస్టర్ విధానం ప్రవేశపెట్టం. ఈ విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఈ విధానం ద్వారా విద్యార్థులు తాను చేరిన కళాశాలలో ఏదైనా సబ్జెక్టు పరంగా, పేపరకు బోధకులు లేకపోవడం, సరైనా సదుపాయాలు లేకపోవటం గాని జరిగినప్పుడు వేరొక కళాశాలలో అన్నీ సదుపాయాలు ఉన్నాయి అనుకుంటే, ఆ విద్యార్థి ఆ కళశాలకు మారే అవకాశాన్ని ఈ క్లస్టర్ విధానం కల్పిస్తుంది. ఈ సదుపాయం ఏదైనా ఒక సెమిస్టర్ లేదా పూర్తి మూడేళ్లకు సద్వినియోగం చేసుకోవచ్చు. పది కళాశాలల్లో ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఉత్తమ పద్దతుల్లో విద్యార్థులకు బోధన ఉంటుంది” అని కమిషనర్ నవీన్ మిత్తల్ అన్నారు.

మరోపక్క ఈ క్లస్టర్‌లో పరిధిలోకి వచ్చే కళాశాలల పేర్లను విద్యా కమిషన్ ప్రకటించింది.. సెయింటాన్స్ కళాశాల (మెహిదీ పట్నం), లయోలా అకాడమీ (సికింద్రాబాద్), సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల, ఆర్‌బీవీవీఆర్ఆర్ కళాశాల (నారాయణగూడ), భవన్స్ వివేకానంద కళాశాల (సైనికపురి), నిజాం కళాశాల, (కోఠి) మహిళా కళాశాల, ప్రభుత్వ సిటీ కళాశాల, బేగంపేట మహిళా కళాశాలు ఉన్నాయి.