కూలీల ఖాతాల్లో రూ. 611 కోట్లు.. స్వయంగా వేసిన యోగి - MicTv.in - Telugu News
mictv telugu

కూలీల ఖాతాల్లో రూ. 611 కోట్లు.. స్వయంగా వేసిన యోగి

March 30, 2020

కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణ సాయంగా వారికి కొంత డబ్బు అందజేశారు. 27 లక్షల మందికి ఊరట కల్పిస్తూ వారి ఖతాల్లో రూ. 611 కోట్లు వేశారు. జాతీయ ఉపాధిహమీ పథకం కింద ఈ డబ్బులను ఆయన పంపిణీ చేశారు. పేద కూలీలకు రోజుకు వెయ్యి రూపాయలు అందజేస్తామని సీఎం చెప్పడం తెలిసిందే. ఈ మొత్తాన్ని కూడా ఆయన త్వరలోనే అందిజేస్తారని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సాయం సందర్భంగా సీఎం కూలీలతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఢిల్లీ శివారుతోపాటు పలు చోట్ల చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు పంపేదుకు యోగి ఇదివరకే వెయ్యి బస్సులు ఏర్పాటు చేశారు.