కేటీఆర్ ట్వీట్ నవ్వు తెప్పిస్తోంది.. కర్ణాటక సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ ట్వీట్ నవ్వు తెప్పిస్తోంది.. కర్ణాటక సీఎం

April 6, 2022

bbgb

బ్యాగులు సర్దుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావాలని ఓ వ్యాపారిని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై గొడవ ముదురుతోంది. ఆ ట్వీట్ తనకు నవ్వు తెప్పించిందని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మట్లాడుతూ ‘కేటీఆర్‌ వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. మా దగ్గర మౌలిక సదుపాయాలు అంత అధ్వానంగా ఉంటే వందలాది స్టార్టప్‌లు, రీసెర్చ్ కరంపెనీలు బెంగళూరులో ఎందుకు ఉన్నాయో చెప్పాలి. ఐటీ బీటీ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలిగాని ఇలా మాట్లాడ్డం మంచింది కాదు. దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 40 శాతం కర్ణాటకే వస్తున్నాయి’ అని సీఎం వివరించారు కర్ణాటకతో తెలంగాణకు, బెంగళూరుతో హైదరాబాద్‌కు పోలిక పెద్ద జోక్‌ అంటూ బొమ్మై అన్నారు. మరోవైపు బీజేపీ కూడా కేటీఆర్ మాటపై స్పందించింది. ‘ఆకాశాన్ని కొలిచేముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలి’ అని కర్ణాటక పార్టీ విభాగం స్వీట్ చేసింది. బెంగళూరులో రోడ్లు బాగాలేవని ఓ వ్యాపారవేత్త చేసిన ట్వీట్ కు కేటీఆర్ బదులిస్తూ ‘ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వచ్చేయండి’ అని అన్నారు.