ఏపీ సీఎం వైఎస్ జగన్ అమరావతిలో ఉన్న గ్రామ వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం అక్కడ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రతీఏటా కౌలు డబ్బులు చెల్లిస్తుండగా, భూమి లేని నిరుపేద గ్రామ వాలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో మార్చి 1 నుంచి రూ. 2500 పెన్షన్ మంజూరు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి వెల్లడించారు. ఇటీవల శ్రీలక్ష్మి అమరావతి గ్రామాల పర్యటన చేసినప్పుడు ఈ విషయం దృష్టికి వచ్చింది. సీఎంకి వివరించి మేలు చేస్తానని వాలంటీర్లకు హామీ ఇచ్చారు. అలాగే సీఎం జగన్‌కి సమస్య వివరించగా, ఆయన వెంటనే ఆమోదించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు మేలు జరుగనుంది.