జగనన్న సాయం పెంపు.. ప్రసవానికి రూ. 5 వేలు - MicTv.in - Telugu News
mictv telugu

జగనన్న సాయం పెంపు.. ప్రసవానికి రూ. 5 వేలు

September 18, 2020

CM Jagan assistance increase .. Normal childbirth Rs.5000

ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద అందిస్తున్న సాయాన్ని పెంచుతున్నట్టు వెల్లడించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3వేల ప్రోత్సాహకాన్ని రూ.5 వేలకు పెంచారు. ఇక సిజేరియన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..  ఆసుపత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో అన్నీ నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని సూచించారు. 

గతవారమే జగన్ ‘వైఎస్సార్ ఆసరా పథకాన్ని’ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.27,168.83 కోట్ల అప్పు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో భాగంగా రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇవాళ జమచేశారు.