CM Jagan bent and removed the teacher's glasses
mictv telugu

టీచర్ కళ్లద్దాలను వంగి తీసిచ్చిన సీఎం జగన్.. పిక్స్ వైరల్

September 5, 2022

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ప్రవర్తనతో మరోసారి ప్రజల మనసులు దోచుకున్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీచర్ల సన్మాన సభలో అవార్డు ఇస్తున్న సమయంలో ఓ ఉపాధ్యాయుడి కళ్లద్దాలు కింద పడిపోయాయి. వెంటనే స్పందించిన సీఎం జగన్ తానే స్వయంగా కిందకు వంగి ఆ కళ్లద్దాలను తీసి టీచర్‌కు అందజేశారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరగడం విశేషం. ఇక అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను గుండెలకు హత్తుకొని జగన్ అభినందించారు. సమాజంలో వారి పాత్రను, మార్పు తీసుకురావడంలో వారి కృషిని కొనియాడారు. తన పిల్లల కోసమే కాక, తరగతిలో ఉన్న పిల్లలు కూడా బాగుపడాలని ఉపాధ్యాయుడు ఆరాపడతాడని పేర్కొన్నారు. మెరుగైన జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన గురువులకు రుణపడి ఉంటానన్న అలెగ్జాండర్ మాటలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.