కొత్తగా పెళ్లి చేసుకున్న, చేసుకోబోతున్న యువతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అమ్మాయికి పెళ్లవగానే అత్తారింటికి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె పుట్టింటి పేరు మారిపోయి అత్తింటి వారి పేరు జత అవుతుందన్నది మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు అత్తింటి పేరు మార్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా సమయం కూడా పట్టేది. ఇప్పుడు ప్రభుత్వం వాటిని సులభతరం చేసింది.
పెళ్లయిన యువతి ఇంటి పేరు మార్చుకోవడానికి గ్రామ/వార్డు సచివాలయాల్లోనే తగిన అవకాశం కల్పించారు. పేరు మార్చుకోవాలనుకునే యువతి నుంచి ఆమె వేలిముద్రలను సచివాలయాల్లో తీసుకుంటారు. వాటిని ఆమోదం కోసం ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్లకు పంపుతారు. ఆమోదం రాగానే ఆమె పేరును రేషన్ కార్డులో చేరుస్తారు. తర్వాత ఆమె అత్తింటి పేరుతో అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హురాలు అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారికి ఈ పద్ధతి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.