CM Jagan canceled poll tax for cable operators
mictv telugu

కేబుల్ ఆపరేటర్లకు సీఎం గుడ్ న్యూస్.. పోల్ ట్యాక్స్ రద్దు

July 30, 2022

ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ ట్యాక్స్‌ను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నిర్వహించిన పాద యాత్రలో కేబుల్ ఆపరేటర్లు వారి సమస్యలను జగన్ దృష్టికి తీసుకురాగా, ఇప్పుడు ఇప్పుడు సీఎం హోదాలో వారికి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మెన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అలాగే త్వరలో ఎపీఎస్ఎఫ్ఎల్ తరపున కొత్త టీవీ ఛానెల్ తీసుకురానున్నట్టు గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆ ఛానెల్ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని వివరించారు.