జంగారెడ్డి గూడెం మృతుల ఘటన ఏపీ అసెంబ్లీలో దుమారం రేపుతోంది. టీడీపీ చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే విధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. అంతకుముందు టీడీపీ సభ్యులు ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టగా.. జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘ సారాపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి దాదాపు 13 వేల కేసులు నమోదు చేసింది. సారా కాసేవాళ్లకు అండగా ఉండాల్సిన అవసరం మాకు లేదు. అసలు జంగారెడ్డి గూడెం జనాభా ఎంత? 55 వేలు. అలాంటి చోట సారా కాయడం సాధ్యమా? పోలీసులు, సచివాలయం, కార్పొరేట్లు ఇలా ఇంత మంది ఉంటే ఎవరైనా సారా కాస్తారా? ఏదో మారుమూల ప్రాంతాల్లో అంటే ఆలోచించవచ్చు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుస్తుందా? టీడీపీ సభ్యులు కామన్ సెన్స్‌తో మాట్లాడాలి. జరగని సంఘటనను జరిగినట్టు విష ప్రచారం చేస్తున్నారు. అబద్ధాన్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారం’టూ దుయ్యబట్టారు.