నాకు ఒక భార్యే అధ్యక్షా.. పవన్‌పై జగన్ సటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు ఒక భార్యే అధ్యక్షా.. పవన్‌పై జగన్ సటైర్

December 9, 2019

CM Jagan02

నాకు ఒక్కరే భార్య ఉన్నారు అంటూ ఏపీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కల్యాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. మహిళా రక్షణ కోసం ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక చర్చ సందర్భంగా ఈసెటైర్లు వేశారు. ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దిశ ఘటన తనను కలిచివేసిందని చెప్పారు. ‘నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక చెల్లెలు, ఒక భార్య ఉన్నారు. ఒక్కరే భార్య ఉన్నారు అధ్యక్షా. కానీ కొంత మంది నేతలు మాత్రం ఒకటి కాదు నాలుగు పెళ్లిలు కావాలని అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘కొందరు పెద్ద పెద్ద నాయకులకు ఈ మధ్య కాలంలో ఒకరు సరిపోరు. ఇద్దరు సరిపోరు. ముగ్గురు సరిపోరు. నలుగురు పెళ్లాలు కావాలని రకరకాలుగా.. దీన్ని బిగమీ అంటారు..’అని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి కేసులు గత ఐదేళ్లలో సుమారు 1100 కు పైగా నమోదయ్యాయని చెప్పారు.

షాద్‌నగర్‌లో దిశపై జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కానీ ఇలాంటి కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడాన్ని హర్షించారు. ఆడపిల్లల తండ్రిగా బాధితుల కుటుంబం సత్వర న్యాయం కోసం ఎలా ఎదురుచూస్తుందో తనకు తెలుసన్నారు. అలాగే వెంటనే స్పందించిన నిందితులకు శిక్ష విధించిన తెలంగాణ సీఎం కేసీఆర్, పోలీసులకు హాట్సాఫ్ అంటూ ప్రశంసించారు. తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసిన తర్వాత నేరస్థులను కాల్చేసినా తప్పులేదన్నారు. కానీ ప్రతి దానికి చంపడం సమాధానం కాదని, పటిష్టమైన చట్టాలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.