విద్యుత్ బిల్లుతో పాటు సేవలపై రైతులు ప్రశ్నించగలగాలి : సీఎం జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

విద్యుత్ బిల్లుతో పాటు సేవలపై రైతులు ప్రశ్నించగలగాలి : సీఎం జగన్

May 4, 2022

ఉచిత విద్యుత్‌కు సంబంధించి రైతుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేట్టు కనపడుతోంది. ఆ కోణంలో ముఖ్యమంత్రి జగన్ ఇంధన శాఖపై సమీక్ష సందర్భంగా బుధవారం ప్రకటన చేశారు. ఇక నుంచి విద్యుత్ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. దాంతో కరెంటు బిల్లులను రైతులే నేరుగా చెల్లించుకోవచ్చని వెల్లడించారు. ఈ పద్ధతి అమలైతే రైతులు విద్యుత్ సేవలు, అంతరాయం వంటి సమస్యలపై అధికారులను నేరుగా ప్రశ్నించగలుగుతాడని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరా, నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు ఇబ్బంది రాకూడదని మార్చిలో పదకొండు వందల కోట్లు పెట్టి 1268 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశామని తెలిపారు. ఏప్రిల్‌లో వెయ్యి కోట్లతో 1047 మిలియన్ల యూనిట్లను కొన్నట్టు వెల్లడించారు.